లడఖ్‌లో పెను విషాదం చోటుచేసుకుంది. శ్రీనగర్-లేహ్ జాతీయ రహదారిపై వాహనాలు వెళ్తుండగా మంచు పెళ్లలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ముగ్గురు పురుషులు, ఒక మహిళ, ఒక చిన్నారి మృతిచెందినట్లు ద్రాస్ సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ (ఎస్డీఎం)విశాల్ అత్రి తెలిపారు. కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ ‘X’ వేదికగా స్పందిస్తూ.. ఈ ఘటనలో మృతుల సంఖ్య ఏడుకు చేరిందని, మరో ఐదుగురు గాయపడ్డారని పేర్కొన్నారు.