PDPL: ధర్మారం మండలం నంది మేడారంలో ఇవాళ మండల పశు వైద్యాధికారి డాక్టర్ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో పశు వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేశారు. రైతులు పశు పోషణలో తగు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వీర్పాల్, పశు వైద్య సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.