AP: విజయవాడ ఉగ్ర లింకుల కేసులో ఇప్పటివరకు 12 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రధానంగా అల్ హకీమ్ షుకూర్ పేరు తెరపైకి వచ్చింది. ఇతడే నిందితులను ఉగ్రవాద కార్యకలాపాల వైపు నడిపించినట్లు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం అరెస్టయిన వారిని కస్టడీలోకి తీసుకుని లోతుగా విచారించేందుకు పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు.