WNP: పెబ్బేరు పట్టణంలో మైనార్టీ ప్రీమియర్ లీగ్ -10(MPL) క్రికెట్ పోటీలను ముఖ్య అతిధిగా పాల్గొని మున్సిపల్ చైర్మన్ అక్కి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. క్రీడలలో గెలుపోటములు సహజమని.. వాటిని క్రీడా స్ఫూర్తితో తీసుకోవాలని క్రీడాకారులకు తెలియజేశారు. ఈకార్యక్రమంలో వైస్ ఛైర్మన్, కౌన్సిలర్లు, మార్కెట్ డైరెక్టర్, స్పాన్సర్లు, క్రీడాకారులు పాల్గొన్నారు.