GNTR: అమరావతి రాజధాని చట్టబద్ధతపై జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల లైవ్ వీక్షణకు వచ్చిన విద్యార్థులతో MP లావు శ్రీకృష్ణదేవరాయలు, MLA జూలకంటి బ్రహ్మానంద రెడ్డి ముచ్చటించారు. శాసన ప్రక్రియ, ప్రజాస్వామ్య విలువలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థులు అడిగిన సందేహాలకు వారు సమాధానాలిస్తూ, భవిష్యత్తు పౌరులుగా సామాజిక చైతన్యం కలిగి ఉండాలని ఆకాంక్షించారు.