SS: సోమందేపల్లిలోని ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీడీవో వెంకటలక్ష్మి మాట్లాడుతూ.. మండలంలో అమలవుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. గ్రామాలలో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు, తాగునీరు, పారిశుద్ధ్యం, రహదారులు తదితర సమస్యలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు.