ప్రకాశం: రేపు టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మర్రిపూడి బస్టాండ్ సెంటర్లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం దగ్గర నిర్వహించనున్నట్లు మండల టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమం మండల టీడీపీ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మండలంలోని అన్ని గ్రామాలలోనూ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు.