SRPT: మోతే మండలంలో ఎండ తీవ్రత పెరిగి ఉష్ణోగ్రతలు 37 డిగ్రీలకు చేరాయి. ఉదయం నుంచే భానుడు భగభగలాడుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏప్రిల్, మే నెలల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. జిల్లా వైద్య అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. ఎక్కువగా నీరు తాగడం, తేలికపాటి దుస్తులు ధరించాలన్నారు.