NZB: సిరికొండ మండలం పెద్ద వాల్ గోట్ గ్రామ పంచాయతీలో ఇవాళ తై బజార్ వేలం పాట నిర్వహించారు. డీఎల్పీవో ఆదేశాల మేరకు కనీస బిడ్ ధర రూ. 66,000గా నిర్ణయించగా, వేములవాడ రాజేశ్వర్ రూ.81,100 వెచ్చించి వేలం దక్కించుకున్నారు. సర్పంచ్ వనిత, ఉపసర్పంచ్ రాములు సమక్షంలో పారదర్శకంగా ఈ ప్రక్రియ ముగిసింది. పంచాయతీ ఆదాయాభివృద్ధికి ఈ వేలం తోడ్పడుతుందని అధికారులు పేర్కొన్నారు.