TG: కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యానికి బీఆర్ఎస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. రేవంత్ రెడ్డి, కేసీఆర్ కుమ్మక్కయ్యారని, రేవంత్ తన స్థాయి మరిచి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రానికి కేంద్రం ఏం చేస్తుందో ప్రజలకు తెలుసని, కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలను వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.