WGL: దేశంలో మహిళలపై దాడులు రోజురోజుకూ పెరుగుతున్నప్పటికీ వాటిని అరికట్టడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ విమర్శించారు. శనివారం నగరంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశంలోని మహిళలకు రక్షణ కరువైందని మండిపడ్డారు.