NZB: సిరికొండ మండలంలోని తూంపల్లి, పాకాల, పందిమడుగు తదితర గ్రామాల్లో అడవులు వారం రోజులుగా మంటల్లో కాలిపోతున్నాయి. గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో విలువైన వృక్ష సంపద బూడిదవుతోంది. అటవీ జంతువుల ప్రాణాలు ముప్పులో ఉన్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటవీ శాఖ అధికారులు తక్షణమే స్పందించి మంటలను అదుపు చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు.