AP: అమరావతి ప్రజారాజధాని అని సీఎం చంద్రబాబు అన్నారు. అమరావతికి చట్టబద్ధత కల్పిస్తే.. భవిష్యత్లో ఎలాంటి ఇబ్బంది ఉండదని తెలిపారు. శాతవాహనులు అమరావతి నుంచే పరిపాలించారని చెప్పారు. బ్రిటీషు మ్యూజియంలో అమరావతి గ్యాలరీ ఉందన్నారు. శాతవాహనుల కాలంనాటి అమరావతి విశేషాలను గ్యాలరీలో భద్రపరిచారని వెల్లడించారు.