టెక్ ప్రియులకు చైనా మొబైల్ తయారీ కంపెనీ వన్ ప్లస్ శుభవార్త చెప్పింది. దేశంలో తమ సర్వీస్ నెట్వర్క్లను 50 శాతం విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నెట్వర్క్లను 400 నుంచి 600లకు పెంచుతున్నట్లు తెలిపింది. ప్రస్తుతం దేశ మార్కెట్ వాటా క్షిణించడంతో వన్ప్లన్ను మూసివేస్తున్నారంటూ ప్రచారం జరుగుతున్న వేళ కంపెనీ ఈ ప్రకటనను విడుదల చేసింది.