VKB: యాలాల(M) ముద్దాయిపేట గ్రామానికి చెందిన జహ్రు హుస్సేన్ అనే దివ్యాంగుడికి తెలంగాణ విద్యావంతుల వేదిక (TVV) అండగా నిలిచింది. అతను నడవలేని స్థితిలో ఉన్నాడని తెలుసుకున్న సంస్థ సభ్యులు ‘ట్రై సైకిల్’ను అందజేశారు. TVV రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవీందర్ గౌడ్ మాట్లాడుతూ.. సమాజంలో ప్రతి ఒక్కరి సహకారంతోనే ఇలాంటి సేవా కార్యక్రమాలు సాధ్యమవుతాయని పేర్కొన్నారు.