డ్రగ్స్ కేసు ఆరోపణలు తనను తీవ్రంగా కుంగదీశాయని సీనియర్ నటి హేమ తెలిపింది. ఒక దశలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని తెలిపింది. ఆ సమయంలో అనుభవించిన మానసిక వేదన వర్ణనాతీతమని పేర్కొంది. అయితే, తాను ఏ తప్పూ చేయలేదనే నమ్మకంతోనే న్యాయపోరాటం చేశానని, చివరకు కోర్టులో నిర్దోషిగా తేలడంతో తనకు ఎంతో ఉపశమనాన్ని ఇచ్చిందని వెల్లడించింది.