AP: కూటమి ప్రభుత్వం దళారులను అడ్డుపెట్టుకుని సన్నకారు రైతులను దోచుకుంటుందని మాజీ మంత్రి పేర్నినాని మండిపడ్డారు. ‘బందరు మండల పరిధిలోని చిన్న చిన్న రైతులను చెరువులు రిపేర్లు చేయకుండా అడ్డుకుంటున్నారు. రెవెన్యూ యంత్రాంగం మంత్రి కొల్లు రవీంద్ర ఏజెంట్లకు సహకరిస్తున్నారు. రైతులను ఇబ్బంది పెడితే సహించబోం’ అని హెచ్చరించారు.