TPT: శ్రీ సర్వమంగళ సమేత పల్లికొండేశ్వర స్వామి దేవస్థానంలో ఆలయ ఛైర్మన్ డి. పద్మనాభ రాజు సమక్షంలో ప్రదోష పూజలు వైభవంగా నిర్వహించారు. ప్రదోషం సందర్భంగా నందీశ్వర స్వామి, వాల్మీకేశ్వర స్వామి వారికి ఏకకాలంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అభిషేకం అనంతరం స్వామి, అమ్మవార్లను పుష్పాలతో అలంకరించి ధూప దీప నైవేద్యాలు, మహాదీపారాధనలు చేశారు.