సూర్యాపేట మున్సిపాలిటీ నూతన పాలక మండలి మొదటి సమావేశంలో 2026-27 సంవత్సరం ముసాయిదా బడ్జెట్ సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఛైర్పర్సన్ మొరిశెట్టి నివేదిత రూ.107.30 కోట్ల బడ్జెట్ను ప్రవేశపెట్టగా పాలకమండలి ఆమోదించింది. మున్సిపాలిటీ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు.