TG: కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్ర జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్లానింగ్, డిజైన్ లోపాల వల్ల రూ.లక్ష కోట్ల ప్రజాధనం వృథా అయిందని మండిపడ్డారు. జల్‌జీవన్ మిషన్ నిధుల వినియోగంలోనూ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందని, రూ.873 కోట్లు అందుబాటులో ఉన్నా రూ.194 కోట్లే ఖర్చు చేసిందని.. మూడేళ్లుగా ఒక్క ప్రతిపాదన కూడా పంపలేదని మంత్రి విమర్శించారు.