VSP: ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఏయూ కన్వెన్షన్ సెంటర్లో వీసీల ప్యానెల్ డిస్కషన్ నిర్వహించారు. “ఏయూ @100-ఫ్రం లెగసీ టు గ్లోబల్ ఇంపాక్ట్” థీంతో జరిగిన ఈ చర్చలు మేధో మధనంగా నిలిచాయి. వివిధ విశ్వవిద్యాలయాలకు సేవలందించిన వీసీలు పాల్గొని గ్లోబల్ నాలెడ్జ్, పబ్లిక్ యూనివర్సిటీల సవాళ్లపై అభిప్రాయాలు పంచుకున్నారు.