కోనసీమ: అయినవిల్లి సిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో ఇవాళ భక్తులు చేసిన వివిధ సేవల ద్వారా రూ.2,81,946 ఆదాయం లభించిందని ఆలయ అధికారులు తెలిపారు. ప్రత్యేక దర్శనం ద్వారా 116 మంది స్వామివారిని దర్శించుకున్నారని, 17 ద్విచక్ర వాహనాలకు పూజలు నిర్వహించారని, 8 మంది దంపతులు లక్ష్మీ గణపతి హోమంలో పాల్గొన్నారని, 1693 మంది అన్న ప్రసాదం స్వీకరించారని అన్నారు.