KDP: ఒంటిమిట్టలో ఏప్రిల్ 1న జరిగే సీతారామ కళ్యాణోత్సవం నేపథ్యంలో కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి హెలిప్యాడ్, TTD అతిథి గృహం, ఆలయ ఏర్పాట్లను పరిశీలించారు. సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన దృష్ట్యా భద్రత, వసతి, రూట్ మ్యాప్‌పై అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని సూచించారు.