BDK: చర్ల మండలం సత్యనారాయణపురం వసతి గృహ వార్డెన్‌ను తక్షణమే విధుల నుంచి తొలగించాలని పీవైఎల్ జిల్లా ఉపాధ్యక్షుడు ముసలి సతీష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఇవాళ హాస్టల్ ఎదుట నిరసన తెలిపారు. వసతి గృహంలోని బియ్యం, పప్పులు అమ్ముకుంటూ విద్యార్థులకు చాలీచాలని అన్నం పెడుతున్నారని విమర్శించారు. ముగ్గురు వంట వాళ్ళు ఉన్నా కూడా విద్యార్థులతో పనులు చేయిస్తున్నారని ఆరోపించారు.