KMR: శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని లింగంపేట మండలం బాణాపూర్లో ఈనెల 29 ఆదివారం కుస్తీ పోటీలు నిర్వహించనున్నారు. విజేతలకు ఆకర్షణీయమైన బహుమతులు ప్రకటించారు. మొదటి బహుమతి రూ.4,001, రెండో బహుమతి రూ.2,001 అందజేయనున్నట్లు గ్రామ పాలకవర్గం తెలిపింది. ఈ పోటీలను తిలకించేందుకు పరిసర గ్రామాల ప్రజలు భారీగా తరలి రానున్నారు.