AP: గతంలో తెలుగువాళ్లను మదరాసీలు అని పిలిచేవాళ్లు అని CM చంద్రబాబు తెలిపారు. పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం వల్లే ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైందని గుర్తు చేశారు. ఆంధ్రరాష్ట్రం ఏర్పాటైన నాడే.. రాజధానిగా విజయవాడ ఉంటే పరిస్థితులు ఇంకోలా ఉండేవని భావించారు. TDP ఆవిర్భావంతో మదరాసీ అనే ముద్ర పోయిందన్నారు. ఒక ప్రాంతీయపార్టీ జాతీయస్థాయిలో ఫ్రంట్ ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు.