WNP: పెబ్బేరు మున్సిపాలిటీ పరిధిలో అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇల్లు కల్పించడం ప్రభుత్వ లక్ష్యమని మున్సిపల్ ఛైర్మన్ అక్కి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శనివారం 3వ వార్డులో ఈశ్వరమ్మకు మంజూరైన ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ఛైర్మన్ భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు ఆఫీసర్ విష్ణు, కౌన్సిలర్ హరి శంకర్ నాయుడు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.