NLG: నకిరేకల్ మున్సిపాలిటీ పాలకవర్గ చివరి బడ్జెట్ సమావేశం ముగిసింది. 2026-27 ఏడాదికి గాను రూ. 36 కోట్లతో బడ్జెట్‌ను ఆమోదించారు. అయితే నకిలీ ఇంటి నంబర్ల కారణంగా పన్నుల వసూళ్లు ఆశించిన స్థాయిలో లేవు. కేవలం రూ.2 కోట్ల పన్ను ఆదాయం వస్తుండగా, అది సిబ్బంది జీతాలకే సరిపోతోంది. సొంత భవనం లేక ఐబీ గెస్ట్ హౌస్‌లోనే అధికారులు ఇబ్బందులు పడుతున్నారు.