PDPL: కలెక్టర్ శ్రీ హర్ష ఇవాళ ధర్మారం మండలంలో విస్తృతంగా పర్యటించారు. కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయం, తహసీల్దార్ కార్యాలయాలను ఆకస్మిక తనిఖీ చేశారు. రిజిస్ట్రేషన్లు సక్రమంగా జరిగేలా చూడాలని రెవెన్యూ సిబ్బందికి సూచించారు. విద్యార్థులకు మంచి నాణ్యమైన భోజనం, నాణ్యమైన విద్య అందేలా చూడాలని తెలిపారు.