AP: రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేసేలా వైసీపీ నేతలు మూడు రాజధానుల నాటకమాడారని మంత్రి పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. జగన్ హయాంలో రాష్ట్రానికి ఒక్క పెట్టుబడి అయినా సాధించారా? అని నిలదీశారు. రాష్ట్రాభివృద్ధి కోసం చంద్రబాబు రాత్రింబవళ్లు కష్టపడుతున్నారని కొనియాడారు. అమరావతి రాజధాని కోసం రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి భూములిచ్చారని తెలిపారు.