GDWL: రెండు నెలలుగా కూలీ డబ్బులు ఇవ్వకుండా పని చేయించుకోవడం వెట్టిచాకిరీ కిందే లెక్క అని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు ఉప్పేర్ నరసింహ అన్నారు. శనివారం గద్వాల మండలంలోని శెట్టి ఆత్కూర్, సంఘాల గ్రామాల్లో ఉపాధి కూలీలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వీబీజీ రామ్ జీ బిల్లు ఉపాధి హామీ చట్టం కోరలు పీకేసేలా ఉందన్నారు.