సినిమా షూటింగ్ సాకుతో దర్శకుడు సనోజ్ మిశ్రా తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని మోనాలిసా సంచలన ఆరోపణలు చేసింది. దీనిపై సనోజ్ మిశ్రా స్పందిస్తూ.. ఆ ఆరోపణలను కొట్టిపారేశాడు. ఆమె వివాహం చెల్లదని తాను అన్నందుకే కక్షతో ఇలా చేస్తోందని, ఆమె కుటుంబం ఇప్పటికీ తన ఇంట్లోనే ఉంటోందని పేర్కొన్నాడు. నిజమైతే అప్పుడే ఫిర్యాదు చేసేవారని అన్నాడు. దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని చెప్పాడు.