MBNR: మిడ్జిల్ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ ఆవరణలో 2026-27 సంవత్సరానికి గాను తై బజార్, సంత బహిరంగ వేలం ఇవాళ నిర్వహిస్తున్నట్లు పంచాయతీ కార్యదర్శి సాయన్న తెలిపారు. ఆసక్తి గలవారు తై బజార్ రూ.30 వేలు, సంతకు రూ.50 వేలు డిపాజిట్ చేయాలని సూచించారు. ఇదివరకు వేలంపాట దక్కించుకొని బకాయి ఉన్నవారు, ఇంటి పన్ను లైసెన్స్ ఫీజు బకాయి ఉన్నవారికి అర్హత లేదన్నారు.