• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

బురదగా మారిన పెదగుడబ దారి

మన్యం: పెదగుడబ ప్రధాన రహదారి ఇటీవల అకాల వర్షాల కారణంగా దారుణంగా మారింది. పార్వతీపురం గరుగుబిల్లి మార్గంలోని ఈ రోడ్డుపై గోతులు ఏర్పడి, క్వారీ లారీల రాకపోకలతో మట్టి బురదగా మారింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతూ, ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. వెంటనే మరమత్తులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

March 28, 2026 / 08:42 AM IST

మంత్రి చొరవతో విద్యుత్ లైన్ సమస్య పరిష్కారం

JGL: ధర్మపురి పట్టణంలో ఇళ్లపై ప్రమాదకరంగా ఉన్న 11 కేవీ విద్యుత్ లైన్ సమస్యకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చొరవతో పరిష్కారం లభించింది. నూతనంగా ఏర్పాటు చేసిన లైన్‌ను ప్రారంభించిన మంత్రి, 2009 నుంచి ప్రజా సమస్యలపై అవగాహనతో ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నానాని అన్నారు. రూ.4.60 కోట్లతో విద్యుత్ లైన్ షిఫ్టింగ్ పనులు కొనసాగుతున్నాయన్నారు.

March 28, 2026 / 08:41 AM IST

మొక్కజొన్న బయోపాలిమర్లతో భూమిలో కరిగే క్యారీ బ్యాగ్..!

HYD: Greeny పేరుతో ఒక స్టార్టప్, IIT HYD సహకారంతో మొక్కజొన్న బయోపాలిమర్లతో నో-ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు తయారు చేసింది. ఈ బ్యాగులు పర్యావరణహితంగా ఉండి అద్భుతంగా పనిచేస్తున్నాయని తెలిపారు. వినియోగం తర్వాత సుమారు 180 రోజుల్లోనే పూర్తిగా మట్టిలో కలిసిపోతాయని వెల్లడించారు. ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా ఇవి మంచి పరిష్కారంగా భావిస్తున్నారు.

March 28, 2026 / 08:39 AM IST

14 మంది కాలిబూడిద.. తిరుపతిలో ALERT

TPT: ఇటీవల మార్కాపురంలో జరిగిన బస్సు ప్రమాదంలో 14 మంది కాలిబూడిదైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తిరుపతి జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. SP సుబ్బరాయుడు, ఆర్టీవో మురళీమోహన్ ఆదేశాలతో నిన్న రాత్రి బస్టాండ్ వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో అధికారులు విస్తృతంగా తనిఖీలు చేశారు.

March 28, 2026 / 08:38 AM IST

ఇకపై ఇంటికే లైసెన్స్‌లు, RCలు!

TG: RC, డ్రైవింగ్ లైసెన్స్‌ల పంపిణీని వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘సెంట్రలైజ్డ్ ప్రింటింగ్, డిస్పాచ్’ విధానానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ విధానం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఒకే కేంద్రం నుండి కార్డులు ముద్రించి నేరుగా వాహనదారుల ఇంటికే పంపిస్తారు. దీనివల్ల అవినీతికి చెక్ పడనుంది. అలాగే యూజర్ ఛార్జీల ఆదాయాన్ని రవాణా శాఖకే కేటాయించాలని CM రేవంత్ నిర్ణయించారు.

March 28, 2026 / 08:38 AM IST

వెంకటేశ్వర స్వామి ఉత్సవాలు ముగింపు

కొంకుదురు బుడతలు మామిడి గ్రామంలో ఉగాది సందర్భంగా ప్రారంభమైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వసంత నవరాత్రి ఉత్సవాలు శుక్రవారం రాత్రి వైభవంగా ముగిశాయి. అర్చకులు బ్రహ్మశ్రీ రమణ శర్మ, శ్రీనివాస శర్మల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు తీర్థప్రసాదం పంపిణీ చేయగా, మల్లిడి కోదండం బ్రదర్స్ పర్యవేక్షణలో ఏర్పాట్లు జరిగాయి.

March 28, 2026 / 08:36 AM IST

‘చెడు అలవాట్లతో జీవితం నాశనం చేసుకోవద్దు’

MHBD: ఇనుగుర్తి మండలంలోని చిన్ననాగరం గ్రామంలో శుక్రవారం స్థానిక ఎస్సై గంగారపు కరుణాకర్ ఆధ్వర్యంలో గ్రామస్తులకు మత్తు పదార్థాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ… గ్రామంలోని యువకులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, గంజాయి, డ్రగ్స్ బారిన పడి జీవితాలు నాశనం చేసుకోవద్దని పేర్కొన్నారు.

March 28, 2026 / 08:36 AM IST

బ్లాక్‌మెయిల్ దందా.. రూ.50 లక్షలు డిమాండ్

CTR: జీడీ నెల్లూరు మండలానికి చెందిన తుమ్మలపల్లి వీరయ్య, మరో వ్యక్తితో కలిసి సబ్-రిజిస్టార్‌ను లక్ష్యంగా చేసుకుని బ్లాక్‌మెయిల్ దందాకు పాల్పడ్డాడు. వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి, ఫోన్ కాల్స్, వాట్సాప్ సందేశాల ద్వారా బెదిరింపులకు దిగుతూ, రూ.50 లక్షలు, ఇంటి స్థలం ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు మదనపల్లి పోలీసులు తెలిపారు. బాధితుడి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారు.

March 28, 2026 / 08:35 AM IST

హబ్సిగూడ సర్కిల్.. కరెంట్ కంట్రోల్ నెంబర్

MDCL: హబ్సిగూడ సర్కిల్ పరిధిలో సమ్మర్ యాక్షన్ ప్లాన్ అమలులో ఉందని డీఈ సుబ్బారావు తెలిపారు. విద్యుత్ సరఫరా అంతరాయాలు లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కొత్త ఫీడర్లు లేదా ఇతర సమస్యలు తలెత్తిన వెంటనే కంట్రోల్ రూమ్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు. సమస్యల పరిష్కారం కోసం 8712471612 నంబర్‌కు కాల్ చేయాలని కోరారు.

March 28, 2026 / 08:35 AM IST

జిల్లాలో ‘కల్తీకి కళ్లెం’ వేస్తున్న అధికారులు

VKB: జిల్లాలో కల్తీ ఆహార పదార్థాలకు, అక్రమ రవాణాకు అధికారులు కళ్లెం వేస్తున్నారు. ఎస్పీ స్నేహ మెహ్రా ఆదేశాల మేరకు కల్తీ ఆహార పదార్థాలతో పాటుగా అక్రమ ఇసుక, కలప, మట్టి దందాలపై టాస్క్ ఫోర్స్ పోలీసులు కొరడా ఝులిపిస్తున్నారు. జనవరి నుంచి ఇప్పటివరకు సుమారు 48 కేసులు నమోదు చేసినట్లు అధికారులు చెప్తున్నారు.

March 28, 2026 / 08:34 AM IST

నంద్యాలలో ఆయిల్, గ్యాస్ సర్వేపై కలకలం

నంద్యాల జిల్లా రుద్రవరం మండలం చిలకలూరులో ఆయిల్, గ్యాస్ సర్వే కార్యకలాపాలు రైతుల మధ్య కలకలం రేపుతున్నాయి. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా తమ పొలాల్లో అధికారులు రంధ్రాలు వేయడంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సర్వేకు సంబంధించిన పూర్తి వివరాలను తెలియజేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై అధికారులు ఇంకా స్పష్టత ఇవ్వాల్సి ఉంది.

March 28, 2026 / 08:34 AM IST

హాస్టల్ భోజనంలో బల్లి.. విద్యార్థులు ఆందోళన

HNK: భీమారంలోని SVS జూనియర్ కళాశాల సమీపంలో ఉన్న శశాంక బాయ్స్ హాస్టల్‌లో శుక్రవారం సాయంత్రం భోజనంలో బల్లి కనిపించడంతో విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే ఈ విషయాన్ని విద్యార్థులు ఫుడ్ అధికారులకు తెలిపారు. స్పందించిన అధికారులు భోజనాన్ని తనిఖీ చేసి..రూ.15,000 జరిమానా విధించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలన్నారు.

March 28, 2026 / 08:34 AM IST

రైలు కింద పడి ఇద్దరు ఆత్మహత్య

WGL: వరంగల్ నగరంలో రెండు వేర్వేరు చోట్ల ఆత్మహత్య ఘటనలు చోటుచేసుకున్నాయి. హంటర్ రోడ్ సంతోష్ మాత దేవాలయం ఎదుట విశాఖ వెళ్తున్న ఏపీ ఏసీ ఎక్స్‌ప్రెస్ కింద పడి రాజస్థానీ యువకుడు జోధారామ్ (30) మృతి చెందాడు. అలాగే ధర్మారం రైల్వే గేట్ సమీపంలో శాతవాహన ఎక్స్‌ప్రెస్ కింద పడి గుర్తుతెలియని యువకుడు (26) ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనలపై రైల్వే పోలీసులు కేసులు నమోదు చేశారు.

March 28, 2026 / 08:33 AM IST

చెరువులోకి దూకి వ్యక్తి ఆత్మహత్య

KMR: మద్యానికి బానిసై వ్యక్తి చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై మహేష్ తెలిపారు. ఎల్లారెడ్డికి చెందిన అన్నారం యాదగిరి(53)అనే వ్యక్తి భార్య కళావతి అనారోగ్యంతో నాలుగేళ్ల క్రితం మృతి చెందింది. అప్పటి నుంచి ఆయన మద్యానికి బానిసై డబ్బుల కోసం కుటుంబ సభ్యులతో గొడవ పడేవాడు. శుక్రవారం సాయంత్రం స్థానిక పెద్ద చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు.

March 28, 2026 / 08:33 AM IST

రైల్వే జంక్షన్‌లో గుర్తు తెలియని వ్యక్తి మృతి

ATP: గుంతకల్లు రైల్వే జంక్షన్‌లోని 2వ ఫ్లాట్ ఫారం వద్ద శనివారం తెల్లవారుజామున ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెంది ఉన్నాడు. విషయం తెలుసుకున్న జీఆర్‌పీ పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. అనారోగ్యంతో మృతి చెంది ఉంటాడని జీఆర్‌పీ పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

March 28, 2026 / 08:33 AM IST