BDK: మణుగూరు పట్టణంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం పై కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడి చేసి దగ్ధం చేసిన సంఘటనా స్థలం వద్దకు ఆదివారం స్పెషల్ పార్టీ బలగాలు చేరుకున్నాయి. డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ పర్యవేక్షణలో 144 సెక్షన్ అమలు చేసే నేతృత్వంలో సిబ్బంది సిద్ధమైనట్టు వారు తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు చేపడుతున్నట్లు వారు వెల్లడించారు.
NLG: గుర్రంపోడ్ మండలంలోని తేనేపల్లి తండాలో ఈ నెల 9న హనుమాన్ గాయత్రి మహాయజ్ఞం నిర్వహిస్తున్నట్లు హనుమాన్ శక్తి జాగరణ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వడిత్య నాగరాజు గురుస్వామి తెలిపారు. ఈ కార్యక్రమానికి సంఘామ్ మహారాజ్ గురూజీ, కే.జయరామ్ గురూజీ, రామ లింగేశ్వర శర్మ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు.
ADB: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా బోథ్ MLA అనిల్ జాదవ్ రహమత్ నగర్ డివిజన్‌లోని కార్మిక నగర్ కాలనీలో సోమవారం పర్యటించారు. ఇంటింటి ప్రచారం చేస్తూ కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని గెలిపించాలని ఓట్లు అభ్యర్థించారు. హామీల పేరుతో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు.
MBNR: షాద్ నగర్ జాతీయ రహదారిపై గురుకుల విద్యార్థినులు ఈరోజు నిరసనకు దిగిన విషయం తెలిసిందే. ప్రిన్సిపల్ శైలజ వేధింపులకు గురిచేస్తున్నారని, తమ నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని, ఆమెను సస్పెండ్ చేయాలని కోరుతూ విద్యార్థినులు ధర్నాకు దిగారు. ఈ క్రమంలో ఉద్రిక్తత నెలకొనగా పోలీసులు విద్యార్థులను అరెస్ట్ చేసి, షాద్నగర్ PSకు తరలించారు.
SDPT: జిల్లాలోని క్రీడా సంఘాలు తమ వివరాలను వెంటనే సమర్పించాలని జిల్లా యువజన క్రీడల అభివృద్ధి అధికారి జంగపల్లి వెంకట నరసయ్య కోరారు. రానున్న సీఎం కప్ను దృష్టిలో ఉంచుకుని, క్రీడా సంఘాలు తమ రిజిస్ట్రేషన్ పత్రాలు, కార్యవర్గ సభ్యుల వివరాలను ఈనెల 5వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా జిల్లా క్రీడా శాఖ కార్యాలయంలో అందజేయాలన్నారు.
AP: కాశీబుగ్గ దేవాలయంలో నిన్న తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పరిశీలించారు. ప్రైవేటు ఆలయమైన దానిపై ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందన్నారు. ఆలయాన్ని నిర్మించిన హరిముకుంద్ పాండా సంకల్పం మంచిదే అయినా.. నిర్మాణం విషయంలో నిపుణుల సలహా తీసుకుని ఉంటే ప్రమాదం జరిగేది కాదన్నారు. కాగా, తొక్కిసలాట ఘటనలో 9 మంది మరణించగా.. 15 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు గోపీచంద్ మలినేని సినిమాను తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే. ‘NBK-111’ అనే వర్కింగ్ టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమా నుంచి అప్‌డేట్ వచ్చింది. రేపు మధ్యాహ్నం 12.01 గంటలకు ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనేది ప్రకటిస్తామని మేకర్స్ వెల్లడించారు. ‘తన రాణిని ఆమె వైభవంతో స్వాగతించడానికి యుద్ధభూమి సిద్ధంగా ఉంది’ అంటూ పోస్ట్ పెట్టారు.
NZB: జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికల నేపథ్యంలో షేక్ పేట్ డివిజన్లో ప్రచారం నిర్వహిస్తున్న బూత్ ఇన్ఛార్జిలతో మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఓటర్ ఐడెంటిఫై, ఇంటింటికి ప్రచారం జరుగుతున్న తీరుపై వారికి పలు సూచనలు చేశారు. ఎన్నికల వేళ వ్యవహరించాల్సిన తీరుపై దిశానిర్దేశం చేశారు.
KMR: తాడ్వాయి మండల కేంద్రంలో బీజేపీ నాయకులు ఆదివారం రాస్తారోకో చేశారు. ఆపరేషన్ సింధూర్‌పై సీఎం రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడంతో రాస్తారోకో చేశామని వారు తెలిపారు. ఆపరేషన్ సింధూర్‌పై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు సరికాదన్నారు. ఈ రాస్తారోకోలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.
MNCL: తప్పుడు లెక్కలతో వరి ధాన్యాన్ని చూపించి సివిల్ సప్లై నిధులు రూ.1.39 కోట్లు కాజేసిన కేసులో 3వ నిందితుడు సాయికుమార్‌ను అతని ఇంటి వద్ద అరెస్టు చేసినట్లు జైపూర్ ఎస్సై శ్రీధర్ తెలిపారు. ఈ కేసులో మిగతా ముద్దాయిలు 12 మంది పరారీలో ఉన్నారన్నారు. వారిని పట్టుకోవడం కోసం SI ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
ASR: జీ.మాడుగుల మండలం చిలకలమామిడి గ్రామంలో పాఠశాల భవనం నిర్మించాలని పెసా కమిటీ మండల అధ్యక్షుడు లకే రామకృష్ణ అధికారులను కోరారు. ఆదివారం పెసా కమిటీ ఉపాధ్యక్షుడు చిరంజీవినాయుడుతో గ్రామంలో పర్యటించారు. గ్రామంలో పాఠశాల భవనం లేక, ఓ ఇంటి వరండాలో తరగతులు నిర్వహిస్తున్నారని గ్రామస్తులు ఆయనకు వినతిపత్రం అందజేశారు. దీంతో పిల్లలు ఇబ్బందులు పడుతున్నారన్నారు.
NZB: తెలంగాణ జాగృతి బలోపేతంపై కవిత ఫోకస్ పెట్టారు. తాజాగా టీచర్స్ ఫెడరేషన్ నూతన కమిటీని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. ఫెడరేషన్ నూతన కమిటీ అధ్యక్షుడిగా మోరం వీరభద్రరావు, ఉపాధ్యక్షుడిగా బుర్ర రమేశ్ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా జాడి శ్రీనివాస్, కోశాధికారిగా ఘనపురం దేవేందర్‌ను నియమించినట్లు ఆమె తెలిపారు.
BHPL: మొంత తుఫాన్ కారణంగా పంట నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకుంటుందని MLA గండ్ర సత్యనారాయణ రావు హామీ ఇచ్చారు. టేకుమట్ల మండలం గుమ్మడివెల్లిలో ఇవాళ MLA పర్యటించి దెబ్బతిన్న పంట పొలాలు పరిశీలించారు. రైతులతో మాట్లాడి సమస్యలు విన్నారు. సమగ్ర సర్వే చేయాలని వ్యవసాయ అధికారులకు ఆదేశించారు. నష్టపరిహారం త్వరగా అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
SDPT: ట్రాఫిక్ ఏసీపీ సుమన్ కుమార్ స్కూల్ బస్సుల భద్రతా ప్రమాణాలపై ప్రకటన విడుదల చేశారు. విద్యార్థుల బస్సు భద్రత పట్ల తల్లిదండ్రులు అవగాహన పెంచుకోవాలన్నారు. పాఠశాల యాజమాన్యాలు తప్పనిసరిగా ఆర్సీ, ఫిట్నెస్ కలిగి ఉండాలని, బస్సు వేగం 40 కి.మీ.కంటే మించరాదని సూచించారు. భద్రతా ప్రమాణాలు పాటించకపోతే వెంటనే ఆర్టీవో లేదా పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.
TG: కాసేపట్లో జూబ్లీహిల్స్ ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. ఎన్నికల ఇంఛార్జ్ నేతలు, మంత్రులు భేటీ కానున్నారు. ఎన్నికల్లో అనుసరించే వ్యూహాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.