MBNR: కార్తిక శుద్ధ ఏకాదశి పర్వదినం సందర్భంగా శనివారం జిల్లా కేంద్రంలోని రుక్మాబాయి సమేత పాండురంగ విఠలేశ్వర స్వామి దేవాలయంలో కళ్యాణోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకుడు ప్రణవ్ అయ్యగారు తెలిపారు. శనివారం ఉదయం 6 గంటలకు అభిషేకం, 10:30 గంటలకు స్వామివారి కళ్యాణం, సాయంత్రం 6:30 గంటలకు స్వామివారి రథోత్సవం జరుగుతాయని పేర్కొన్నారు.
కోనసీమ: సంక్షేమం, అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని బీజేపీ నాయకులు కోన సత్యనారాయణ అన్నారు. ఇంటింటికి వెళ్లి లబ్దిదారులకు పింఛన్లు అందిచడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు. పట్టణంలోని 23,24 వార్డుల తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్‌లు బొడ్డు రామకృష్ణ, కడియాల వెంకట లక్ష్మిలతో కలిసి శనివారం ఫించన్లు పంపిణీ చేశారు.
ATP: గుంతకల్లు అవోపా ఆధ్వర్యంలో శనివారం ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అవోపా అధ్యక్షుడు ధార రాము మాట్లాడుతూ.. తెలుగు మాట్లాడే ప్రజల కోసం ప్రత్యేక రాష్ట్రం కావాలని ప్రాణత్యాగం చేసిన గొప్ప మహనీయులు పొట్టి శ్రీరాములని స్మరించారు.
NTR: పేదల సామాజిక భద్రత, ఆర్థిక భరోసానే ప్రధాన లక్ష్యంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేస్తున్నట్లు ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. మైలవరంలో పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా పింఛన్లు పెంచి ఇస్తున్నట్లు వెల్లడించారు. ప్రతి నెలా రూ.4వేల నుంచి రూ.15వేల ఆర్థిక సాయం పింఛన్ రూపంలో లభిస్తుందన్నారు.
BDK: ఇల్లందు పట్టణంలోని అమరులు కామ్రేడ్ రాయల చంద్రశేఖర్, కామ్రేడ్ గండి యాదన్నల స్థూపం వద్ద శనివారం CPI(ML) మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ చండ్ర అరుణక్క ఎర్రజెండ ఆవిష్కరించారు. అనంతరం పాయం వెంకన్న అధ్యక్షతన సభ నిర్వహించి మాట్లాడారు. ప్రజా పోరాటంలో నిరంతరం శ్రమిస్తూ ప్రాణ త్యాగాలు చేసిన వారికి విప్లవ జోహార్లు అని అన్నారు.
తమిళనాడులో ఇటీవల చోటుచేసుకున్న కరూర్ తొక్కిసలాట ఘటనపై హీరో అజిత్ స్పందించారు. దీనికి విజయ్ మాత్రమే కాదు అందరూ బాధ్యులేనని చెప్పారు. తన ఉద్దేశం ఎవరినీ తక్కువ చేయడం కాదన్నారు. ఇలాంటి గందరగోళ పరిస్థితులు కేవలం సినీతారల సభల్లో ఎక్కువగా జరుగుతుందని తెలిపారు. ఇలా ఎందుకు జరుగుతోంది? దీనివల్ల ఇండస్ట్రీకి చెడ్డ పేరు వస్తుందన్నారు.
MNCL: సింగరేణి కార్పోరేట్ జనరల్ మేనేజర్ (పర్సనల్)గా ఏజేఎం మురళీధర్ రావు నియమితులయ్యారు. ఈ మేరకు యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. మురళీధర్ రావు జనరల్ మేనేజర్ (పర్సనల్) తో పాటు కార్పోరేట్ స్థాయిలో ఎగ్జిక్యూటివ్ ఎస్టాబ్లిష్‌మెంట్ సెల్, రిక్రూట్‌మెంట్ సెల్‌కు ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు నిర్వహిస్తారు. శనివారం ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు.
ప్రకాశం: అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం చిరస్మరణీయమని కనిగిరి వైసీపీ ఇన్‌చార్జ్ దద్దాల నారాయణ యాదవ్ అన్నారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా శనివారం పట్టణంలోని రామాలయం వీధిలో ఉన పొట్టి శ్రీరాములు విగ్రహానికి పార్టీ శ్రేణులతో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ.. పొట్టి శ్రీరాములు మన జిల్లా వార్షికావటం సంతోషిదాయకం అని పేర్కొన్నారు.
KRNL: ఆదోని-ఎమ్మిగనూరు మధ్య కోటేకల్ శివారులో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో కపటి గ్రామానికి చెందిన గొల్ల రంగవేణి(14) అక్కడికక్కడే మృతి చెందగా, 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పత్తి తీయడానికి వెళ్తున్న మహిళల ఆటోను బెంగళూరుకు చెందిన మినీ వ్యాన్ వెనుక నుంచి ఢీకొట్టింది. క్షతగాత్రులను ఎమ్మిగనూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
NDL: బనగానపల్లె మండలం పలుకూరు గ్రామంలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి జయంతి ఉత్సవాలను ఇవాళ ఘనంగా నిర్వహించారు. పలుకూరు గ్రామానికి చెందిన జేకేఆర్ సంస్థ అధ్యక్షుడు బ్రహ్మానంద ఆచారి ముందుగా పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి చిత్రపటానికి పూలమాల వేసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానం గురించి ప్రజలకు వివరించారు.
KDP: బ్రహ్మంగారిమఠంలో వీరబ్రహ్మేంద్రస్వామి 417వ జయంతి ఉత్సవాలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా స్వాముల వారికి ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోమాలు, అభిషేకాలు నిర్వహించారు. ఇందులో భాగంగా బ్రహ్మంగారిమఠం మఠాధిపతుల కుటుంబ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
విశాఖలో వైరల్ అవుతున్న HPCL అగ్నిప్రమాదం వీడియోపై పోలీసులు స్పందించారు. HPCLలో భారీ అగ్ని ప్రమాదం జరిగిందని.. అత్యవసర బృందాలు మంటలను అదుపు చేస్తున్నాయని.. ప్రజలు అటువైపుగా ప్రయాణించకండి అంటూ వైరల్ అవుతున్న వీడియో పూర్తిగా అవాస్తవం అని తేల్చి చెప్పారు. HPCLలో ఎటువంటి అగ్ని ప్రమాదం సంభవించలేదని పోలీసులు నిర్ధారించారు.
KMM: మోంథా తుపాన్ ప్రభావం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీపై పడింది. ఏడు డిపోల నుంచి 127 బస్సు సర్వీసులను నిలిపివేయగా, సంస్థ రూ.29,73,145 ఆదాయాన్ని కోల్పోయింది. అత్యధికంగా సత్తుపల్లి డిపోకు రూ.7,86,718, కొత్తగూడెం రూ.6,13,620, ఖమ్మం రూ.5,03,447, భద్రాచలం రూ.4,66,051, మధిర రూ.2,30,800, ఇల్లందు రూ.2,01,702, మణుగూరు రూ.1,70,805 నష్టం వాటిల్లింది.
కోనసీమ: రాష్ట్ర రోడ్డు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్‌గా మలికిపురం మండలం లక్కవరం గ్రామానికి చెందిన ముదునూరి వేణుగోపాల కృష్ణంరాజు నియమితులయ్యారు. ఈ మేరకు ఆదేశాలు వెలువడ్డాయని ఆయన శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 16 మందిని ఈ పదవిలో నియమించారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలువురు ఆయనను అభినందించారు.
NLG:హైదరాబాద్- విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జాం అయింది. చిట్యాల వద్ద రైలు వంతెన కింద వరద నీరు భారీగా చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పెద్దకాపర్తి నుంచి చిట్యాల వరకు 5 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచాయి. వాహనాలు నెమ్మదిగా కదులుతుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.