E.G: తుఫాన్ హెచ్చరికల దృష్ట్యా గోకవరం మండలంలో మూడు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తహసీల్దార్ రామకృష్ణ తెలిపారు. తంటికోండ, కామరాజుపేట, గోకవరంలో ఏర్పాటు చేశామన్నారు. ఎటువంటి అత్యవసర పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు 8 ట్రాక్టర్లను, 8 జేసీబీలు, జనరేటర్ సిద్ధం చేసినట్లు తెలిపారు. త్రాగునీటి చెరువుల వద్ద రెవెన్యూ సిబ్బందిని కాపల ఉంచామన్నారు.
PDPL: పాలకుర్తి మండలం బసంత్ నగర్ ఎయిర్ పోర్టు ప్రాంతంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పంటను విక్రయించేందుకు ప్రతి మండలంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని, రైతులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
NZB: ఇప్పటికే జిల్లాలో వరి, మొక్క జొన్న సేకరణకు కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యా యని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. సోయాబీన్ రైతుల సౌకర్యార్థం కూడా జిల్లాలో నేడు 12 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేలా చర్యలు తీసుకున్నామని ఆయన వెల్లడించారు. సోమవారం సాయంత్రం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
GNTR: మొంథా తుపాను ప్రభావంతో ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ (జీఎంసీ) అప్రమత్తమైంది. నగరంలో 72 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసింది. సోమవారం రాత్రికి 112 మంది ఈ కేంద్రాలకు చేరుకోగా, నోడల్ అధికారులు వారికి వసతులు కల్పించారు. తుపాను సంబంధిత సమస్యల సహాయం కోసం 08632345103 కు ఫోన్ చేయాలని కమిషనర్ సూచించారు.
JGL: తెలంగాణ మోడర్‌ను కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా జగిత్యాల రూరల్ మండలం పోరండ్ల గ్రామానికి చెందిన ఆరే తిరుపతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని ఆలిండియా మోడర్న్ కబడ్డీ అసోసియేషన్ ఫౌండర్ కుంభం రాంరెడ్డి తెలిపారు. అసోసియేషన్ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని ఆయన తెలిపారు. పలువురు ఆయనను అభినందించారు.
SRD: బుస్సా రెడ్డి పల్లిలోని మిషన్ భగీరథ మోటార్ల మరమ్మతుల కారణంగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో 28 నుంచి 30వ తేదీ వరకు నీటి సరఫరాను నిలిపివేస్తున్నట్లు మిషన్ భగీరథ ఈఈ విజయలక్ష్మి తెలిపారు. మునిపల్లి, కోహిర్, జరాసంఘం, జహీరాబాద్, మొగుడంపల్లి, సంగారెడ్డి, కంది సదాశివపేట, కొండాపూర్, పటాన్ చెరు మండలాలు, తెల్లాపూర్ మున్సిపాలిటీలో నీటి సరఫరా జరగదన్నారు.
ASF: జిల్లాలో నిర్వహించిన 2025-27 ఎక్సైజ్ సంవత్సరానికి సంబంధించిన వైన్ షాపులను నిబంధనల మేరకే నిర్వహించాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. జిల్లాలోని 25 వైన్ షాపుల లక్కీ డ్రా నిర్వహణ పూర్తి అయిందన్నారు. డిసెంబర్ 1 నుంచి నూతన మద్యం దుకాణాలు కొనసాగనున్నాయని తెలిపారు.నిబంధనల ప్రకారం దుకాణాలు నిర్వహించాలని ఆదేశించారు.
AP: మొంథా తుఫాను గమనం తీరం దాటే విషయంలో మార్పు ఉండకపోవచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. కాకినాడ సమీపంలోనే తీరం దాటవచ్చని.. లేకపోతే తుని సమీపం లేదా నరసాపురం వైపు కొద్దిగా దిశ మారే అవకాశం ఉందని తెలిపింది. దీంతో తమిళనాడులో వర్షాలు తగ్గి.. ఒంగోలు నుంచి శ్రీకాకుళం వరకు నెమ్మదిగా వర్షాలు పెరుగుతాయని పేర్కొంది.
VPS: బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుఫాన్ కారణంగా బీచ్ రోడ్‌లోని లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని నగర మేయర్ పీలా శ్రీనివాసరావు పేర్కొన్నారు. సోమవారం రాత్రి ఆయన జీవీఎంసీ ప్రధాన వైద్యాధికారి డాక్టర్ నరేష్ కుమార్, మూడవ జోన్ జోనల్ కమిషనర్ శివప్రసాద్, జీవీఎంసీ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి అప్పుఘర్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను పరిశీలించారు.
AP: మంత్రులు, అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష ముగిసింది. మొంథా తుఫాన్‌పై ఆందోళన అవసరం లేదని పేర్కొన్నారు. అయినప్పటికీ అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. రేపు ఉదయంలోపు తుఫాన్ తీరం దాటుందని RTGS సెంటర్ నుంచి నేరుగా అలర్ట్ చేయాలన్నారు. ప్రతి విభాగం సన్నద్ధంగా ఉండాలని సూచించారు.
BDK: ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు జిల్లాలో వరి ధాన్యం, పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి సమర్థవంతంగా కొనుగోలు కొనసాగుతున్నదని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపారు. తెలంగాణ మంత్రులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కనీస మౌలిక వసతులు కల్పించామన్నారు.
ELR: జిల్లాలో ‘మొంథా తుఫాను’ ప్రభావం కారణంగా మంగళవారం నుంచి అన్ని రేషన్ షాపుల ద్వారా నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. తుఫాను ప్రభావం కారణంగా నవంబర్‌లో నిత్యావసర వస్తువులను నేటి నుంచి అన్ని రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేస్తారని తెలిపారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
SRD: జిల్లాలో 3,750 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు లక్ష్యంగా నిర్ణయించినట్లు కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. లక్ష్య సాధన కోసం వ్యవసాయ శాఖ అధికారులు ఇప్పటినుంచే కృషి చేయాలని, ఆయిల్ పామ్ పంట సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు.
PLD: నకరికల్లు మండలం చీమలమర్రిలో జరిగిన రచ్చబండ వేదికపై విద్యా పరిరక్షణ గళం మారుమోగింది. ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులతో కలిసి డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ రెడ్డి నిర్వహించారు. అధికారం ప్రజల కోసమేనని, విద్య అమ్మకాందోళనకు చెక్ పెట్టేందుకే ఈ పోరాటమని గజ్జల స్పష్టం చేశారు.
W.G: ‘మొంథా’ తుఫాన్ ప్రభావం దృష్ట్యా 36 మందితో ఒక NDRF బృందాన్ని జిల్లాలో ఏర్పాటు చేశామని కలెక్టర్ నాగరాణి అన్నారు. జిల్లా కలెక్టరేట్‌లో ఆమె మాట్లాడుతూ.. విద్యుత్, రెవెన్యూ, పోలీస్, R&B, NH, వైద్య శాఖలను పూర్తి స్థాయిలో విధులకు కేటాయించడం జరిగిందన్నారు. తుఫాన్ కారణంగా పశువులకు వ్యాధులు సంక్రమించకుండా హెచ్ఎస్ వ్యాక్సిన్ వేశామన్నారు.