WGL: గ్రేటర్ వరంగల్ 19వ డివిజన్ పరిధిలోని కాశిబుగ్గలో ఇందిరాగాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ పాల్గొని ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రిగా ఆమె చేసిన సేవలను మంత్రి స్మరించుకున్నారు. స్థానిక కార్పొరేటర్ ఓని స్వర్ణలత- భాస్కర్, కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.
E.G: నిడదవోలు నియోజకవర్గం పెండ్యాల గ్రామంలో మొంథా తుఫాన్ బాధితులను మంత్రి కందుల దుర్గేష్ శుక్రవారం కలిశారు. బాధితులకు 25 కిలోల బియ్యం, 1 కిలో పంచదార, కందిపప్పు, పామాయిల్, ఉల్లిపాయలు,1 కిలో బంగాళదుంపలు గ్రామంలోని 44 కుటుంబాలకు పంపిణీ చేసారు. నియోజకవర్గంలోని 23 గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు సురక్షితంగా తరలించడం జరిగిందని తెలిపారు. మొత్తం 312 కుటుంబాలకు అందజేసామన్నారు.
E.G: రాజానగరం మండలం కలవచర్ల గ్రామంలో ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ శుక్రవారం పర్యటించారు. మొంథా తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న వరి పంటలను ఎమ్మెల్యే బలరామకృష్ణ అధికారులతో కలిసి పరిశీలించారు. రైతులతో మాట్లాడి పంట నష్టాన్నికి పరిహారం అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆయన వెంట ప్రభుత్వ అధికారులు, మండల ప్రత్యేక అధికారి పాల్గొన్నారు.
ASR: అరకు, అనంతగిరి, హుకుంపేట మండలాల్లోని లోతేరు, వేంగడ, మజ్జివలస, పట్టాం ఏరియాల్లో రాత్రి పూట డ్రోన్లు ఎగరడం ఆదివాసులను భయ పెడుతుందని గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బాలదేవ్ అన్నారు. కలెక్టర్, ఎస్పీ తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని శుక్రవారం అరకులో డిమాండ్ చేశారు. రాత్రి పూట డ్రోన్లు ఎగరుతున్నాయని ఇటీవల పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశామన్నారు.
MHBD: మున్సిపాలిటీ పరిధిలోని ఏటిగడ్డతండా సమీపంలో మున్నేరు వాగు వద్ద మొంథా తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న రోడ్డు, కూలిన విద్యుత్ స్తంభాలు, ఇసుక మేటలతో నష్టపోయిన వరి పొలాలను ఎమ్మెల్యే డా. భూక్యా మురళీ నాయక్ గురువారం పరిశీలించారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. ప్రజల భద్రత దృష్ట్యా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ELR: నూజివీడు మండలం మద్దాయి కుంట గ్రామంలోని జడ్పీ హైస్కూల్లో శుక్రవారం సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. హెచ్ఎం దారపురెడ్డి భాస్కరరావు మాట్లాడుతూ.. ఉక్కు మనిషిగా పేరుపొందిన వల్లభాయ్ పటేల్ స్వదేశీ సంస్థానాలను ఏకం చేస్తూ సువిశాల భారతావని నిర్మాణానికి పూనుకున్నట్లు చెప్పారు.
NTR: దీర్ఘకాలం పాటు గంపలగూడెం గ్రామ ప్రజలకు సేవలందించిన జూనియర్ అసిస్టెంట్ తల్లపురెడ్డి వెంకటేశ్వర రెడ్డిని గంపలగూడెం సర్పంచ్ కోట పుల్లమ్మ-వెంకటేశ్వరరావు దంపతులు శుక్రవారం ఘనంగా సత్కరించారు. స్థానిక పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటైన సత్కార కార్యక్రమంలో ఎంపీడీవో టీ. సరస్వతి పరిపాలనాధికారి విష్ణువర్ధన్ పలువురు నాయకులు పాల్గొన్నారు.
AKP: సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా అనకాపల్లి జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం జాతీయ సమైక్యత దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీలు దేవప్రసాద్, మోహన్ రావు పటేల్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. దేశ సమగ్రత, ఐక్యత, భద్రతను కాపాడడానికి కృషి చేస్తామని పోలీసులతో ప్రతిజ్ఞ చేయించారు.
ATP: జాతీయ ఏకత్వ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి ఎస్పీ పీ.జగదీష్ నివాళులర్పించారు. దేశాన్ని ఏకతాటిపై నడిపించిన పటేల్ సేవలు ప్రశంసనీయమని, స్ఫూర్తిదాయకం అని కొనియాడారు. అనంతరం వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో గెలుపొందిన పోలీసు సిబ్బందికి, విద్యార్థులకు ఆయన బహుమతులు ప్రదానం చేశారు.
SKLM: సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి ఉత్సవాలను జలుమూరులోని మోడల్ ప్రైమరీ పాఠశాలలో శుక్రవారం నిర్వహించారు. భారతదేశ ఏకత్వానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ సేవలను విద్యార్థులకు వివరించారు. సర్దార్ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని విద్యార్థులందరూ భావి భారత పౌరులుగా ఎదిగి అత్యున్నత శిఖరాలకు చేరుకోవాలని ఉపాధ్యా యులు సూచించారు.
PPM: పోలీసు విధులు అత్యంత బాధ్యతాయుతమైనవని, ఒత్తిడితో కూడుకున్నవని, ఆరోగ్యంపై పోలీసులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని పాలకొండ డీఎస్పీ రాంబాబు సూచించారు. పోలీసు అమరవీరుల స్మారకోత్సవంలో భాగంగా శుక్రవారం పాలకొండ పోలీసు కార్యాలయంలో సిబ్బంది ఆరోగ్య సంరక్షణకు, సామాజిక సేవా కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తూ మెగా ఉచిత వైద్యం, రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు.
VZM: ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా స్దానిక 38వ డివిజన్ గోకపేటలో గోడ కూలి రెయ్యి సన్యాసమ్మ (74) అనే మహిళ మరణించారు. ఈ నేపథ్యంలో స్దానిక ఎమ్మెల్యే పూసపాటి అతిది గజపతిరాజు శుక్రవారం ఘటన జరిగిన ప్రాంతానికి వెళ్లి బాధిత కుటుంబ పరామర్శించారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.
కోనసీమ: అల్లవరం మండలం దేవగుప్తం పంచాయతీ పరిధిలో ఓ వ్యక్తి చాకుతో ఇద్దరిపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. చింతలమెరక ప్రాంతానికి చెందిన దాసరి రాజేష్ వద్ద పెయ్యల రమణ చేపల వేటకు వినియోగించే వల తీసుకున్నాడు. అది పాడవడంతో ఇద్దరికీ వాగ్వాదం జరిగింది. దీంతో రాజేష్ చాకుతో రమణపై దాడి చేసి ఛాతిలో బలంగా పొడిచాడు. అడ్డుకున్న వ్యక్తి పై కూడా దాడి చేశాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
TG: పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్‌గా MLA ప్రేమ్‌సాగర్ రావును నియమించారు. ప్రభుత్వ సలహాదారుగా బోధన్ MLA సుదర్శన్ రెడ్డిని నియమించారు. 6 గ్యారంటీల అమలు బాధ్యత కూడా అప్పగించారు. మంత్రి పదవి ఆశించిన ఈ ఇద్దరికి కేబినెట్ హోదా పదవులు ఇచ్చారు. కేబినెట్ సమావేశాలకు ప్రత్యేక ఆహ్వానితుడిగా సుదర్శన్ రెడ్డి ఉండనున్నారు. మంత్రులకు ఉండే సదుపాయాలన్నీ కల్పిస్తూ జీవో జారీ చేశారు.
భారత నావికాదళం 2026 ఫిబ్రవరిలో విశాఖపట్నంలో అంతర్జాతీయ నౌకాదళ సమీక్షను నిర్వహించబోతోంది. ఫిబ్రవరి 18వ తేదీన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నౌకాదళాన్ని సమీక్షిస్తారు. ఈ కార్యక్రమంలో తొలిసారిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన INS విక్రాంత్‌తో పాటు అత్యాధునిక కల్వరి క్లాస్ జలాంతర్గాములు కూడా పాల్గొంటాయి. ఈ సమీక్ష ద్వారా భారత నావికాదళం శక్తిని ప్రపంచ దేశాలకు చూపించనున్నారు.