ఓ యువతి ఫోన్ ఎక్కువ సేపు ఉపయోగించి వ్యాధికి గురైంది. ప్రతి రోజు 14 గంటలు వినియోగించిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఫెనెల్లా ఫాక్స్(29) డిజిటల్ వెర్టిగో అనే వ్యాధి బారిన పడినట్లు తెలిపింది. ఆ క్రమంలో యూకేకు చెందిన ఆమె వీల్ చైర్ కు పరిమితమై..ఆరు నెలల వైద్యం తర్వాత కోలుకున్నట్లు వెల్లడించింది.
Union Minister convoy attacked:కేంద్ర సహాయ మంత్రి నిశిత్ ప్రమాణిక్ (Nisith Pramanik) పశ్చిమ బెంగాల్ పర్యటనలో చేదు అనుభవం ఎదురయ్యింది. ఆయన కాన్వాయ్‌పై సొంత నియోజకవర్గంలోనే దాడి జరిగింది. పశ్చిమ బెంగాల్ లోని కూచ్ బెహర్ దుండగులు రాళ్లు రువ్వారు. స్థానిక బీజేపీ ఆఫీసుక వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. గుంపును చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ప్రత్యర్థులపై కర్రలు పట్టుకుని బీజేపీ కార్యకర...
సుదూర ప్రేమికులు, జంటల కోసం చైనాలో కొత్తగా ముద్దు పరికరం’ అందుబాటులోకి వచ్చింది. ఈ పరికరం ద్వారా నిజంగా ముద్దు పెట్టుకున్న ఫీలింగ్ కల్గుతుందని ఈ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. దీని వివరాలు, రేటు గురించి ఈ కింది వార్తలో చూసేయండి.
sonia gandhi:కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ (sonia gandhi) కీలక నిర్ణయం తీసుకున్నారు. క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించారు. భారత్ జోడో యాత్ర (bharat jodo yatra) తరువాత తన పొలిటికల్ ఇన్నింగ్స్ ముగియనుందని తెలిపారు. పదేళ్ల యూపీఏ (upa regime) ప్రభుత్వం తనకు సంతోషం కలిగించిందని తెలిపారు. 2024 ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి.. దేశానికి పరీక్ష లాంటివని అన్నారు. రాయ్ పూర్‌లో (raip...
మార్చి 2వ తేదిన తారకరత్న(Tarakaratna) పెద్ద కర్మ కార్యక్రమం జరగనుంది. హైదరాబాద్ ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో పెద్ద కర్మను కుటుంబ సభ్యులు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి ఓ కార్డును కూడా కుటుంబీకులు ముద్రించారు. ఆ కార్డులో వెల్ విషర్స్ గా బాలక్రిష్ణ(Balakrishna), వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి(Vijaya sai reddy) పేర్లను ముద్రించడం విశేషం.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు అమెరికన్ నటి టిగ్ నొటారో క్షమాపణ చెప్పారు. హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్స్ కార్యక్రమంలో చెర్రీ వ్యాఖ్యాతగా పాల్గొన్నాడు. ఆ క్రమంలో అమెరికన్ నటి టిగ్ నోటారో హోస్ట్ గా వ్యవహరించిన క్రమంలో చరణ్ పేరు పలకడంలో నోటారో ఇబ్బంది పడ్డారు. అందుకు గాను ఆమె చెర్రీకి అపాలజీ తెలియజేశారు.
ys sharmila meet governer:తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని వైఎస్ఆర్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిల (ys sharmila) గవర్నర్ (governer) తమిళి సై సౌందర రాజన్‌ను కోరారు. ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. ఈ రోజు మధ్యాహ్నం రాజ్ భవన్‌లో (Raj bhavan) గవర్నర్‌తో భేటీ అయ్యారు. ఇటీవల జరిగిన పరిణామాలను ఆమెకు వివరించారు.
తెలంగాణలో నాన్ వెజ్ ప్రియులకు శుభవార్త. ఎందుకంటే త్వరలోనే మొదటిసారిగా హైదరాబాద్ పరిధిలో మటన్ క్యాంటీన్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ గొర్రెల, మేకల అభివృద్ది సంస్థ ఛైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ పేర్కొన్నారు. ఇప్పటికే ఏర్పాటు చేసిన ఫిష్ క్యాంటీన్లు సక్సెస్ అయిన క్రమంలో.. మటన్ క్యాంటీన్లను మార్చిలో ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.
తిరుమల(Tirumala) పుణ్యక్షేత్రం పర్యావరణ పరిరక్షణకు అనేక రకాల చర్యలు తీసుకుంటోంది. సంపూర్ణ ప్లాస్టిక్ నిషేధంలో భాగంగా టీటీడీ(TTD) ప్రత్యేక నిర్ణయాలు తీసుకుంది. తిరుమలలో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు మరో వినూత్న ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగా శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని(Srivari laddu prasadam) ఇక నుంచి తాటాకు బుట్టల్లో భక్తులకు అందించనుంది.
దేశంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించేందుకు భావసారూప్యత గల పార్టీలతో పొత్తు పెట్టుకునేందుకు తాము సిద్ధమని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే(Mallikarjun Kharge) అన్నారు. ఛత్తీస్‌గఢ్ రాయ్‌పూర్లో చేపట్టిన కాంగ్రెస్ పార్టీ 85వ ప్లీనరీ సమావేశంలో భాగంగా ఖర్గే స్పష్టం చేశారు.
ప్రధాని మోదీ కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డిపై (Kishan Reddy) ప్రశంసలు కురిపించారు. చిన్నారుల ఆరోగ్యం కోసం సికింద్రాబాద్ నియోకవర్గంలో కిషన్ రెడ్డి చేపట్టిన ‘హెల్తీ బేబీ షో’ (Healthy Baby Show') అనే కార్యక్రమాన్ని ప్రధాని మోదీ( PMModi) అభినందించారు. ఇది చిన్నారులకు ఎంతో మేలు చూస్తుందని అభిప్రాయపడ్డారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ తనకు ఇద్దరు హాలీవుడ్ హీరోయిన్ ల పట్ల క్రష్ ఉందని చెప్పారు. రామ్ చరణ్ దర్శకత్వంలో వచ్చిన RRR సినిమా ఇటీవలికాలంలో ప్రపంచవ్యాప్తంగా అనేక అవార్డులు, రికార్డులతో ఆకర్షిస్తున్న విషయం తెలిసిందే.
మధ్యప్రదేశ్ (Madhya Pradesh) లో ఘోర రోడ్డుప్రమాదం (Road accident) చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన ట్రక్కు ఆగిఉన్న మూడు బస్సులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 12 మంది మరణించగా, 39 మందికి గాయాలయ్యాయి. వీరిలో పది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా( Amit Shah) బహిరంగ సభలో పాల్గొని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
కాంగ్రెస్ పార్టీ జాతీయ రెండోరోజు మహాసభల్లో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక వాద్రా(Priyanka Vadra) రాయ్‌పూర్‌కు చేరుకున్నారు. దీంతో ఆమెకు కాంగ్రెస్ (Congress) నేతలు భారీ సంఖ్యలో స్వాగతం పలికారు. రాయ్ పూర్ చేరుకోగానే పూలవర్షం కురిపించారు. ఉదయం 8.30 గంటలకు ఆమె రాయ్‌పూర్ (Raipur) విమానాశ్రయానికి చేరుకున్నారు.
preethi is still critical:మెడికో ప్రీతి (preethi) ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉంది. నిమ్స్ ఆస్పత్రి వైద్యులు శనివారం హెల్త్ బులెటిన్ (health bulletein) విడుదల చేశారు. ప్రీతికి ఆధునాతన వైద్యం అందజేస్తున్నామని.. ఆమెను బ్రతికించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. ప్రీతికి (preethi) ఎక్మో, వెంటిలేటర్‌పై చికిత్స ఇస్తున్నామనివివరించారు.