మెగా సోదరులపై మంత్రి రోజా గురువారం విరుచుకుపడ్డారు. ప్రజలకు చిన్న సాయం కూడా చేయని ఆ కుటుంబాన్ని ఓటర్లు ఎప్పటికి అప్పుడు తిప్పి కొడుతున్నారన్నారు. ప్రజలకు కనీస సాయం చేయలేదు కాబట్టే ముగ్గురిని కూడా ప్రజలు సొంత జిల్లాల్లో ఓడించారన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మొదటి నుండి చంద్రబాబు తప్పులు చేసినప్పుడు నోటికి ప్లాస్టర్ వేసుకుంటాడని, ఆయన తప్పులు చేసి, ఇబ్బందుల్లో పడినప్పుడు బయటకు వచ్చి మద్దతుగా నిలిచే ప్రయత్నాలు చేస్తాడన్నారు. ఆయన ప్యాకేజీ కోసం మాత్రమే ఇలా చేస్తారని ఆరోపించారు.
ఇప్పటంలో గోడలు కూలిన వ్యాల్యూ ప్రజల ప్రాణాలకు లేదా అని భగ్గుమన్నారు. కందుకూరులో, గుంటూరులో సభలలో ప్రజలు చనిపోతే మాట్లాడని వ్యక్తి, ఇప్పటం గురించి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారన్నారు. అంతేకాకుండా, ఇప్పుడు సభలపై అన్ని పార్టీల కోసం ఓ జీవీ తీసుకు వస్తే తమ గొంతు నొక్కుతారా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ఏమిటన్నారు. పవన్‌కు ప్రజలు రాజకీయ సమాధి కట్టడం ఖాయమన్నారు. చంద్రబాబు నాయుడు అంటే శవాల నాయుడు అని, కుప్పంలో ఆయన కూసాలు కదులుతున్నాయన్నారు. కుప్పం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈడ్చి తన్నితే హైదరాబాద్‌లో పడ్డారన్నారు.
చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లపై వైసీపీ ఎంపీ నందిగం సురేష్ కూడా ఆగ్రహించారు. చంద్రబాబు వంటి బాధ్యత లేని వ్యక్తిని తాను చూడలేదన్నారు. సైకో ఇజం కారణంగానే ఎన్టీఆర్ పదవి లాక్కున్నారన్నారు. శాడిజం చంద్రబాబు నుండి పుట్టింది అన్నారు. చంద్రబాబుతో పాటు లోకేష్ కూడా సైకో అన్నారు. చంద్రబాబు మోసాలు చేసి రాజకీయాల్లోకి వచ్చారని, ఆయన అక్కడి నుండి బయటకు రాలేరన్నారు. అలాగే, పవన్ సినిమాల నుండి బయటకు రాలేరన్నారు.
మనుషుల ప్రాణాలకు విలువ లేకుండా చంద్రబాబు, పవన్ ప్రవర్తిస్తున్నారన్నారు. పవన్ సినిమాల్లో నుండి ఎప్పటికీ బయటకు రాలేరన్నారు. సైకిల్ పోవాలి… నేను కూడా పోవాలి అని చంద్రబాబు చెప్పాలని ఎద్దేవా చేశారు. చంద్రబాబు సైకిల్ కాబట్టే సైకిల్ గుర్తు ఆయనకు వచ్చిందన్నారు. మొత్తం పదకొండు మంది చనిపోయారని, అందులో పవన్, చంద్రబాబుకు కావాల్సిన వాళ్లు ఉంటే పరిస్థితి ఏమిటన్నారు.