ఢిల్లీ హిట్ అండ్ రన్ తరహా సంఘటన మరోటి చోటుచేసుకుంది. నోయిడా లో హిట్ అండ్ రన్ కేసులో…ఓ స్విగ్గీ డెలివరీ బాయ్ ప్రాణాలు కోల్పోయాడు. కౌశల్ యాదవ్ అనే స్విగ్గీ ఏజెంట్ ఆ రోజు రాత్రి ఒంటిగంట ప్రాంతంలో బైక్ పై వెళ్తుండగా ఓ కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో కౌశల్ కిందపడిపోగా ఆ కారు సుమారు కిలోమీటర్ దూరం వరకు అతడ్ని లాక్కుపోయింది. తన కారుకు ఏదో యాక్సిడెంట్ జరిగినట్టు తెలుసుకుని డ్రైవర్ వాహనాన్ని ఆపి చూశాడట. కింద పడి ఉన్న వ్యక్తిని చూడగానే భయంతో అక్కడి నుంచి పారిపోయాడట.
అయితే ఆదివారం తెల్లవారుజామున 1 గంటలకు కౌశల్ సోదరుడు అమిత్ అతడికి ఫోన్ చేశాడు. కానీ బాధితుడు అప్పటికే మరణించడంతో ఫోన్ లిఫ్ట్ చేయలేకపోయాడు. అయితే అటుగా నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తి ఫోన్ లిఫ్ట్ చేసి ఈ ప్రమాదం గురించి తెలియజేశాడు. దీంతో అమిత్ పోలీసులకు సమాచారం అందించాడు. అతడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు పాల్పడిన నిందితుడి ఆచూకీ కోసం ఆ ప్రాంతంలో అమర్చిన సీసీటీవీలను పోలీసులు పరిశీలిస్తున్నారు.