ప్రకాశం జిల్లా కందుకూరులో ఇటీవల చంద్రబాబు నిర్వహించిన రోడ్ షో లో… తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఈ తొక్కిసలాటలో దాదాపు 8మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా… ఈ ఘటనకు బాధ్యుడిని చేస్తూ… టీడీపీ కందుకూరు ఇంఛార్జ్ ఇంటూరి నాగేశ్వరరావును పోలీసులు అరెస్టు చేశారు.
హైదరాబాదులో తన కార్యాలయంలో ఉండగా నాగేశ్వరావుని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు ఆయనని కందుకూరు తరలిస్తున్నట్టు తెలుస్తోంది. కందుకూరు నుంచి హైదరాబాద్ వచ్చిన అక్కడి పోలీసులు కందుకూరు ఘటనలో నాగేశ్వరరావును చేసినట్లు సమాచారం.
రెండు కార్లలో వచ్చి అరెస్టు చేసిన కందుకూరు పోలీసులు ఆయనను కందుకూరు తీసుకు వెళ్తున్నట్టు చెబుతున్నారు. ఇక ఈ అంశం మీద అధికారిక సమాచారం అందాల్సి ఉంది. కాగా… ఈ అరెస్టుపై టీడీపీ ఆరోపణలు చేస్తోంది. మియాపూర్లోని తన కార్యాలయంలో ఉన్న నాగేశ్వరరావును బలవంతంగా అదుపులోకి తీసుకున్నట్టు ఆయన కార్యాలయ సిబ్బంది ఆరోపిస్తున్నారు.
నాగేశ్వరరావును ఎక్కడి తీసుకెళ్లారనేది వెల్లడించలేదని అంటున్నారు. తొక్కిసలాట ఘటనకు సంబంధించి అనేక మందిపై కేసు నమోదు చేశారని.. కానీ.. తొలుత ఆయన్నే అరెస్టు చేశారని వాపోతున్నారు. అయితే.. నాగేశ్వరరావు ఆధ్వర్యంలోనే సభ ఏర్పాట్లు జరిగడంతో.. పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.