తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం రూ.5వేల కోట్ల రూపాయలు ఇచ్చిందని… కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పైసా కూడా ఇవ్వలేదని ప్రచారం చేస్తోందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. లిక్కర్ స్కాం పై కూడా ఆయన స్పందించారు. లిక్కర్ కేసులోకి తెలంగాణ వాళ్ళను రమ్మని మేం పిలవలేదని అన్నారు. దర్యాప్తు జరుగుతుంటే కల్వకుంట్ల కుటుంబ సభ్యుల పేర్లు వచ్చాయని తెలిపారు.
తెలంగాణ వ్యక్తుల కోసం దర్యాప్తు ప్రారంభం కాలేదని, ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ను దర్యాప్తు చేస్తుంటే తెలంగాణ వాళ్ళ పేర్లు వచ్చాయని తెలిపారు. కావాలనే కేంద్రం కక్ష్య కట్టిందని ప్రచారం చేస్తున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. గులాబీ దళ నాయకులు భారత రాష్ట్ర సమితే కాదు వరల్డ్ రాష్ట్ర సమితి పెట్టుకున్నా తమకు నష్టం లేదని కిషన్ రెడ్డి అన్నారు.
గ్రామ పంచాయితీలకు కేంద్రం విడుదల చేసిన నిధులను కేసీఆర్ ప్రభుత్వం మళ్లించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. కేంద్రం నిధులు విడుదల చేసిన గంటల్లోనే రాష్ట్ర ప్రభుత్వం నిధులను ఇతర ఖాతాల్లోకి మళ్లించిందని కిషన్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం 5 వేల కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసిందని కిషన్ రెడ్డి చెప్పారు. కేంద్రం నుండి ఒక్క పైసా కూడా రాలేదని కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న ప్రచారాన్ని కిషన్ రెడ్డి తప్పుబట్టారు.
పెట్రోల్, డీజీల్ రేట్లు తెలంగాణలోనే అధికంగా ఉన్నాయని కిషన్ రెడ్డి చెప్పారు. దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో పెట్రోల్, డీజీల్ రేట్లపై వ్యాట్ విధించారని కిషన్ రెడ్డి చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పెట్రోల్, డీజీల్ ధరలున్నాయని కేంద్ర మంత్రి చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలోనే పెట్రోల్, డీజీల్ ధరలున్నాయని కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు.