WGL: వరంగల్ నగరంలో రెండు వేర్వేరు చోట్ల ఆత్మహత్య ఘటనలు చోటుచేసుకున్నాయి. హంటర్ రోడ్ సంతోష్ మాత దేవాలయం ఎదుట విశాఖ వెళ్తున్న ఏపీ ఏసీ ఎక్స్ప్రెస్ కింద పడి రాజస్థానీ యువకుడు జోధారామ్ (30) మృతి చెందాడు. అలాగే ధర్మారం రైల్వే గేట్ సమీపంలో శాతవాహన ఎక్స్ప్రెస్ కింద పడి గుర్తుతెలియని యువకుడు (26) ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనలపై రైల్వే పోలీసులు కేసులు నమోదు చేశారు.