TG: బాసర ట్రిపుల్ ఐటీ ఇన్ఛార్జ్ వీసీ గోవర్ధన్ తన పదవికి రాజీనామా చేశారు. విద్యార్థిని తేజస్విని మృతి, క్యాంపస్లో వరుస వివాదాల నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. బాధితులకు రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలని TSAS నాయకులు డిమాండ్ చేస్తుండగా.. మరోవైపు వీసీ రాజీనామాను వెనక్కి తీసుకోవాలని మరికొందరు విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు.