HNK: భీమారంలోని SVS జూనియర్ కళాశాల సమీపంలో ఉన్న శశాంక బాయ్స్ హాస్టల్లో శుక్రవారం సాయంత్రం భోజనంలో బల్లి కనిపించడంతో విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే ఈ విషయాన్ని విద్యార్థులు ఫుడ్ అధికారులకు తెలిపారు. స్పందించిన అధికారులు భోజనాన్ని తనిఖీ చేసి..రూ.15,000 జరిమానా విధించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలన్నారు.