పర్యావరణ పరిరక్షణ కోసం ‘ఎర్త్ అవర్’ పాటించాలనే సంప్రదాయం 2007లో మొదలైంది. ఈసారి మార్చి 28 రాత్రి 8:30 నుంచి 9:30 గం. వరకు గంటపాటు అనవసర విద్యుత్ దీపాలను ఆర్పివేసి ఈ కార్యక్రమంలో భాగం కావాలని పర్యావరణ ప్రేమికులు పిలుపునిచ్చారు. పచ్చదనం పెంచడం, సుస్థిర భవిష్యత్తును నిర్మించడమే లక్ష్యంగా ఈ చిన్న ప్రయత్నం పర్యావరణంలో పెద్ద మార్పుకు నాంది పలుకుతుందని వారు పేర్కొన్నారు.