ATP: గుంతకల్లు రైల్వే జంక్షన్లోని 2వ ఫ్లాట్ ఫారం వద్ద శనివారం తెల్లవారుజామున ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెంది ఉన్నాడు. విషయం తెలుసుకున్న జీఆర్పీ పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. అనారోగ్యంతో మృతి చెంది ఉంటాడని జీఆర్పీ పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.