TPT: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది. మొత్తం 73,519 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 21,564 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం సుమారు ₹4.30 కోట్లు నమోదైంది. ప్రస్తుతం 4 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండి ఉన్నాయి. సర్వదర్శనానికి (SSD టోకెన్లు లేకుండా) సుమారు 8 గంటల సమయం పడుతోంది.