W.G: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల విషయంలో ఎటువంటి జాప్యం లేకుండా చూడాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి డీఎస్పీలకు సూచించారు. జిల్లాస్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం మంగళవారం కలెక్టరేట్లో నిర్వహించారు. 2025 నవంబర్ నుంచి 2026 మార్చి 15 వరకు జిల్లాలో మొత్తం 18 అట్రాసిటీ కేసులు నమోదయ్యాయని తెలిపారు.